![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -105 లో... నర్మద అన్న మాటలు సాగర్ వేదవతికి చెప్పగానే.. నా కోడలు ఎంత గొప్ప మనసు గలది అని అనుకుంటుంది. సాగర్ చెప్పింది రామరాజు కూడా వింటాడు. సాగర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక.. చూసారా మన కోడలు ఎంత మంచిదో గవర్నమెంట్ జాబ్ ఉంది. నా కొడుకుని ఎలా ఆడిస్తుందో అనుకున్నాను కానీ నా కోడలు బంగారం.. ఇలా అయితే అందరు హ్యాపీగా ఉంటారని వేదవతి అంటుంది. హ్యాపీగా ఉన్నదాన్ని పాడు చెయ్యడానికి ఉన్నాడు కదా మీ చిన్న కొడుకు అని రామరాజు అంటాడు. వాడు చాలా మంచివాడు. వాడు ఇలా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇలాంటి కొడలు వచ్చిందని వేదవతి అంటుంది. వీడు దగ్గరుండి చేసాడు కాబట్టి చేసుకున్నాడు లేదంటే నా మాటకి ఎదురివ్వడని రామరాజు అంటాడు.
మరొకవైపు ప్రేమ వర్క్ చేసే కాఫీ షాప్ దగ్గరికి భద్రవతి వాళ్ళు వస్తారు. అక్కడ తనని చూసి షాక్ అవుతారు. ఓనర్ ప్రేమపై కోప్పడుతుంటే భద్రవతి వెళ్ళాలని చూస్తుంది కానీ ప్రేమ ఆపుతుంది. భద్రవతి వాళ్ళు బాధపడుతూ ఇంటికి వెళ్తారు.
మరొకవైపు నర్మద కోసం వెయిట్ చేస్తుంది వేదవతి. స్కూటీ పై తనని ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే అందరు ఎవరు ఆ పిల్ల అని అడుగుతారు. నా కోడలు అంటూ నర్మద గురించి వేదవతి గొప్పగా చెప్తుంటే.. నర్మద ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత ప్రేమ ఇంటికి రాగానే భద్రవతి.. రామరాజు వాళ్ళని పిలుస్తుంది. నా మేనకోడలిని కాఫీ షాప్ లో వర్క్ చెయ్యడానికి పంపిస్తున్నారంటూ కోప్పడుతుంటే నేను వెళ్లే విషయం వాళ్లకు తెలియదు.. ఇప్పటికే మావయ్య వాళ్ళని చాలా బాధపెట్టారు.. ఇక అనొద్దంటు చెప్పి ప్రేమ లోపలికి వెళ్తుంది.
తరువాయి భాగంలో జాబ్ మానేయమని రామరాజు అంటాడు. నేను మానేయనని ప్రేమ అంటుంది. మా నాన్నకి ఎదరుతిరుగుతున్నావంటూ ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |